బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ సారి అక్టోబర్ లోనే పెళ్లి ముహూర్తాలు మొదలు కావడంతో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ 3 నెలల్లో పెళ్లిళ్ల సందడి అంబరాన్నంటనుంది. నవంబర్ డిసెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 48లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( CAIT ) జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్ లో ఎంతంటే?
అక్టోబర్ 18న మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు)పై రూ. 870 పెరగగా..22 క్యారెట్ల బంగారం ధరపై రూ.800 పెరిగింది.
పెరిగిన రేట్లతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 78, 980గా ఉండగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,400 గా ఉంది.
హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నంలో అక్టోబర్ 18 ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 72400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 78890 నమోదయ్యింది.
2 వేలు పెరిగిన వెండి
దసరా సమయంలో తగ్గినట్టే తగ్గి.. మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి రూ. 2000 మేరకు పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 1,05,000గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లలో కిలో రూ. 99,000గా నమోదయ్యింది.