న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. 2 గంటల్లోనే 3 వేల రూపాయలు తగ్గాయి. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరలు మంగళవారం (23-07-2024) నాడు 10 గ్రాములు రూ.72,838 ఉండగా, బడ్జెట్ ప్రవేశపెట్టాక రూ.68,500కు బంగారం ధర పతనమైంది. కొన్ని గంటల్లోనే బంగారం ధర 10 గ్రాములపై 4,218 రూపాయలు తగ్గింది. బంగారం కొనుగోలుదారులకు ఇది సదవకాశంగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం ధరల పతనం తాత్కాలికమేనని, మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
Also Read:-పేరెంట్స్.. పిల్లల విషయంలో అతి జోక్యం వద్దు... ఎందుకంటే..
బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా బడ్జెట్ అనంతరం భారీగా పతనమయ్యాయి. బడ్జెట్కు ముందు కేజీ వెండి ధర 88,995 రూపాయలు ఉండగా.. బడ్జెట్లో బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించాక రూ.84,275కు పడిపోయింది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్ల వినియోగదారులకు, బులియన్ ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.