- గోల్డ్ రేటు తగ్గుతోంది
గత ఏడాది ప్రపంచాన్ని కరోనా వణికిం చినా, లాక్ డౌన్లు పెట్టినా బంగారం రేట్లు మాత్రం పైపైకే దూసుకెళ్లాయి. ఆగస్టు నెలలో ఆల్ టైం హైని తాకిన బంగారం రేట్లు ఇప్పుడు మళ్లీ దిగొస్తున్నాయి. వారం రోజులుగా అయితే రోజురోజుకూ మరిం తగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో గురువారం తులం (10 గ్రాములు) బంగారం రూ.49 వేలకు దిగొచ్చిం ది. అసలు సరిగ్గా నెల కిం ద రూ.53,500 ఉండగా.. ఇప్పుడు దాదాపు ఐదు వేలు తగ్గింది.
హైదరాబాద్, వెలుగు: స్టాక్‌మార్కెట్లు పడిపోవడం, అమెరికాఫెడ్ నిర్ణయాల ఎఫెక్ట్, టోకుగా బంగారానికి డిమాండ్ పెరగడంతో గత ఏడాది బంగారం రేట్లు దూసుకెళ్లాయి. 2020 జనవరి ఒకటిన తులం రూ.39,119 పలకగా.. ఆ ఏడాది ఆగస్టు తొలివారం నాటికి ఆల్‌టైం హై రూ.58 వేల మార్కును తాకింది. తరువాత మెల్లగా కాస్త తగ్గుతూ వచ్చింది. గత డిసెంబర్ చివర్లో 51 వేలకు తగ్గినా.. సరిగా నెల రోజుల కింద జనవరి 5వ తేదీకి మళ్లీ 53,500కు పెరిగింది. తర్వాత జనవరి నెలాఖరు వరకు కాస్త అటూ ఇటూగా కొనసాగింది. కేంద్ర బడ్జెట్ పెట్టిన ఈ నెల ఒకటో తేదీ నుంచి మళ్లీ తగ్గుతూ వస్తోంది.
రేట్లు ఎందుకు పెరిగాయి?
కరోనా కారణంగా గ్లోబల్ ఎకానమీ రికవరీ కావడం కష్టమనే భయంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లను వదిలేసి బంగారం భారీగా కొన్నారు.
యూఎస్ లోవడ్డీ రేట్లు, డాలర్ రేటు తగ్గి.. ఇన్వెస్టర్లు అంతా పసిడి కొనడంతో డిమాండ్ పెరిగింది.
మన స్టాక్ మార్కెట్లు పడిపోవడం, లాక్డౌన్ టైంలో ఫైనాన్షియల్ వ్యవస్థ ఎలా ఉంటుందోనన్న సందేహాలతో ఇన్వెస్టర్లతోపాటు జనం కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొన్నారు.
ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి బంగారం రేట్లు సెట్ అయ్యాయి. జనజీవనం మామూలు స్థితికి వస్తుందని, ఎకానమీ పుంజుకుంటుందన్న అంచనాలతో ఇన్వెస్ట్మెంట్లు స్టాక్ మార్కెట్ల వైపు వెల్లువెత్తాయి. ఈ టైంలో బంగారానికి డిమాండ్ తగ్గింది.
బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 12.5% నుంచి 7.5 శాతానికి తగ్గిస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. దీనితోనూ రేట్లు దిగొస్తున్నాయి.
ఇప్పట్లో పెద్ద పండుగలు ఏవీ లేకపోవడం, ఎకానమీ క్రైసిస్, లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల జనం ఇన్‌కం తగ్గి.. బంగారం కొనుగోళ్ల వైపు చూడటం లేదు.
మళ్లీ పెరగొచ్చు!
ప్రస్తుతం రేట్లు తగ్గుతున్నా భవిష్యత్తులో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పర్టులు చెప్తున్నారు. కరోనా పరిస్థితి కుదుటపడటంతో జనం ఫైనాన్షియల్‌గా సెట్ అవుతారని అంటున్నారు. దానికితోడు పెళ్లిళ్లు, ఫంక్షన్లు సాధారణంగా జరిగితే బంగారం కొనుగోళ్లు పెరుగు తాయని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఓ ఏడాది తర్వాత బంగారం రేటు రూ.65 వేలకు పెరగొచ్చని చెప్తున్నారు.