Gold Rate: స్టాక్ మార్కెట్ల పతనంతో తగ్గిన గోల్డ్ రేట్లు.. భిన్నమైన పరిస్థితి ఎందుకు..?

Gold Rate: స్టాక్ మార్కెట్ల పతనంతో తగ్గిన గోల్డ్ రేట్లు.. భిన్నమైన పరిస్థితి ఎందుకు..?

Gold Price Today: గడచిన మూడు రోజులుగా పసిడి ధరలు భారతదేశంలో తగ్గుతున్నాయి. ఒకప్పుడు సేఫ్ హెవెన్ గా భావించి చాలా మంది అనిశ్చితి సమయాల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టేవారు. అయితే ఇప్పటికే గరిష్ఠాలకు ధరలు చేరిన వేళ పసిడికి ఆల్టర్నేట్ పెట్టుబడి మార్గాలను ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా స్టాక్ మార్కెట్ల పతనంతో చాలా మంది పెట్టుబడిదారులు.. నిపుణుల సూచన మేరకు వేచి చూసే ధోరణిని అవలంభించటంతో పసిడి ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 500 భారీ పగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 285, ముంబైలో రూ.8వేల 285, దిల్లీలో రూ.8వేల 300, కలకత్తాలో రూ.8వేల 285,  బెంగళూరులో రూ.8వేల 285, కేరళలో రూ.8వేల 285, వడోదరలో రూ.8వేల 290, జైపూరులో రూ.8వేల 300, మంగళూరులో రూ.8వేల 285, నాశిక్ లో రూ.8వేల 288, అయోధ్యలో రూ.8వేల 300, బళ్లారిలో రూ.8వేల 285, గురుగ్రాములో రూ.8వేల 300, నోయిడాలో రూ.8వేల 300 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

►ALSO READ | Sensex Crash: 3వేల పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ కల్లోలం..

24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేడు రూ.2800 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైలో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు  చెన్నైలో రూ.9వేల038, ముంబైలో రూ.9వేల038, దిల్లీలో రూ.9వేల053, కలకత్తాలో రూ.9వేల038,  బెంగళూరులో రూ.9వేల038, కేరళలో రూ.9వేల038, వడోదరలో రూ.9వేల043, జైపూరులో రూ.9వేల053, మంగళూరులో రూ.9వేల038, నాశిక్ లో రూ.9వేల041, అయోధ్యలో రూ.9వేల053, బళ్లారిలో రూ.9వేల038, గురుగ్రాములో రూ.9వేల053, నోయిడాలో రూ.9వేల053 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 285 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల038గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 3వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.