
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కాస్త ఊరట నిచ్చిన ధరలు గురువారం (ఫిబ్రవరి 13)న మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర రూ.380 లు పెరిగి 87వేల 050లకు చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400లు పెరిగి 79వేల 800 లకు చేరింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87వేల 050లు, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79వేల 800లుగా ఉంది. మరో వైపు హైదరాబాద్ లో వెండికి కూడా డిమాండ్ పెరిగింది. కొనుగోలు ఎక్కువగా ఉండటంతో కిలో వెండి ధర రూ. లక్షా 07వేలుగా ఉంది.
ALSO READ | లోక్‌సభలో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే
బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ,కేంద్రం విధించే దిగుమతి సుంకాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.