Gold Rates: పసిడి ప్రియులకు గుడ్న్యూస్..బంగారం రేట్లు తగ్గాయి..ఎంతంటే

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్న్యూస్..బంగారం రేట్లు తగ్గాయి..ఎంతంటే

పసిడి ప్రియులకు గుడ్న్యూస్..బంగారం ధరలు దిగొచ్చాయి..గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ( ఫిబ్రవరి 12) ఊరట కలిగించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర రూ.710 లు తగ్గి 86వేల 670 ల వద్ద ట్రేడ్ అవుతోంది.అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 లు తగ్గి 79వేల 400 లకు చేరింది. 

ఫిబ్రవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రారంభంలో 84 వేల 490 లున్న బంగారం ధర.. 12రోజుల్లో రూ. 2వేలకు పైగా పెరిగింది. ఇదే కంటిన్యూ అయితే మే నాటికి బంగారం ధరలు లక్షకు చేరుకునే అవకాశం ఉంది.  అంతర్జాతీయ మార్కెట్లో మార్పులను  బట్టి బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోను కావచ్చు.  

బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి రేట్లు,కేంద్రం విధించే దిగుమతి సుంకాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.