
Gold Price Today: మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది. అయితే చైనాపై ట్రంప్ టారిఫ్స్ ప్రతికూలత వల్ల ప్రపంచ సరఫరా గొలుసులో పెద్ద మార్పులు వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా కాపాడుకునేందుకు పసిడి నిల్వలను పెంచుకునే పనిలో ఉన్నాయి. ఇదే క్రమంలో సాధారణ ప్రజల నుంచి పెట్టుబడిదారుల వరకు చాలా మంది సేఫ్ హెవెన్ కొనుగోలుతో తమ సంపదను కాపాడుకోవాలని చూడటం రిటైల్ కొనుగోలుదారులకు షాక్ కి గురిచేస్తోంది. దీంతో వారాంతంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా పెరిగిన రేట్లను గమనించటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 770, ముంబైలో రూ.8వేల 770, దిల్లీలో రూ.8వేల 785, కలకత్తాలో రూ.8వేల 770, బెంగళూరులో రూ.8వేల 770, కేరళలో రూ.8వేల 770, పూణేలో రూ.8వేల 770, వడోదరలో రూ.8వేల 775, జైపూరులో రూ.8వేల 785, మంగళూరులో రూ.8వేల 770, నాశిక్ లో రూ.8వేల 773, అయోధ్యలో రూ.8వేల 785, బళ్లారిలో రూ.8వేల 770, నోయిడాలో రూ.8వేల 785, గురుగ్రాములో రూ.8వేల 785 వద్ద ఉన్నాయి. పైన వెల్లడించిన ధరలు జీఎస్టీ, మజూరి, తరుగు, వ్యాపారి లాభాలను పరిగణలోకి తీసుకోకముందువిగా గమనించాలి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 700 భారీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 567, ముంబైలో రూ.9వేల 567, దిల్లీలో రూ.9వేల 582, కలకత్తాలో రూ.9వేల 567, బెంగళూరులో రూ.9వేల 567, కేరళలో రూ.9వేల 567, పూణేలో రూ.9వేల 567, వడోదరలో రూ.9వేల 570, జైపూరులో రూ.9వేల 582, మంగళూరులో రూ.9వేల 567, నాశిక్ లో రూ.9వేల 570, అయోధ్యలో రూ.9వేల 582, బళ్లారిలో రూ.9వేల 567, నోయిడాలో రూ.9వేల 582, గురుగ్రాములో రూ.9వేల 582గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.87వేల 700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులం(10 గ్రాములకు) రూ.95వేల670గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేల 900 పెరిగి రూ.లక్ష 10వేల వద్ద కొనసాగుతోంది.