- హైదరాబాద్లో ధర రూ.69,820
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.వెయ్యి తగ్గడంతో రూ.70,650కి పడిపోయింది. భారీ అమ్మకాలు, విదేశీ మార్కెట్లలో రేట్లు తగ్గడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.
బుధవారం 10 గ్రాముల ధర రూ.71,650 ఉంది. వెండి ధర కూడా ఒక్కసారిగా కిలోకు రూ.3,500 తగ్గి రూ.84,000కి చేరుకుంది. క్రితం సెషన్‌లో కిలో రూ.87,500 వద్ద ముగిసింది. పసిడిపై కస్టమ్స్ సుంకాలను ఆరు శాతానికి తగ్గించాలని ప్రభుత్వం బడ్జెట్లో నిర్ణయించింది. దీంతో జులై 23న కిలోకు రూ. 5,000 తగ్గి రూ. 72,300 వద్ద ముగిసింది.-- ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పతనం. హైదరాబాద్లో గురువారం బంగారం ధర రూ.69,820లకు, కిలో వెండి ధర రూ.89 వేలకు పడిపోయింది.