Gold Rates:5 రోజులుగా పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు.. దసరాకి ఇంకా పెరుగుతుందా..?

Gold Rates:5 రోజులుగా పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు.. దసరాకి ఇంకా పెరుగుతుందా..?

పసిడి ప్రియులకు షాక్..బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో బంగారం ధర తగ్గినట్టే తగ్గి..పెరగడం మొదలైంది.గత ఐదు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేదు.ఈ లెక్కన పెరుగుతూపోతే..త్వరలో10 గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకునేలా ఉంది. 

హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా వరుసగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25, 2024) కూడా రూ.600 పెరిగింది. మంగళవారం 22 క్యారెట్ల10గ్రాముల బంగారం ధర రూ.70వేల 60 లుండగా..రూ.600 పెరిగి 70వేల 660 కి చేరింది.10గ్రాముల 24 క్యారెట్ల్ బంగారం ధరూ.70వేల 636 ఉండగా.. 660 రూపాయలు పెరిగి రూ.70వేల702 లకు చేరింది. 

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనయ్యాయి. గత నెలలో పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు తగ్గాయి. దాదాపు 70వేలకు దిగువకు వచ్చాయి.10 గ్రాముల ధర 66వేలకు పడిపోయింది.