
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఇప్పట్లో ఏమాత్రం తగ్గు ముఖం పట్టేలా కనిపించడం లేదు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఇవాళ(గురువారం, ఫిబ్రవరి 20, 2025) కూడా పెరిగింది. 390 రూపాయలు పెరగడంతో 24 గ్రాముల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 88,040 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా 350 రూపాయలు పెరిగి 80,350 రూపాయల నుంచి 80,700 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర లక్షా 8 వేలు పలికింది. బంగారం ధరలు పెరుగుతున్న తీరును గమనిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 90 వేల మార్క్ను చేరుకునేలా ఉంది.
బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయంటే.. గడచిన పదేళ్లలో డబుల్ అయిన పరిస్థితి. పదేళ్ల క్రితం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,470 రూపాయలు. ఇప్పుడు ఇదే బంగారం ధర 88,040 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర పదేళ్లకు మునుపు 41,890 రూపాయలు ఉంటే 2025లో 80,700 రూపాయలకు పెరిగింది. 2025 డిసెంబర్ నాటికి తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read :- కస్టమర్లకు గూగుల్ పే బిగ్ షాక్..
సాధారణంగా రెసిషన్ సమయాల్లో పసిడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బంగారంలో భారీగా పెట్టుబడులు పెరిగాయి. ఇన్ఫ్లేషన్ పెరిగినా బంగారానికి డిమాండ్పెరిగింది. స్టాక్స్, బాండ్లు, కరెన్సీల్లో రాబడులు తగ్గినా విలువ పెరుగుతుంది. వీటన్నింటినీ బట్టి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఎకనమిక్ స్లోడౌన్, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.