బాబోయ్ ఇంత రేటా : హైదరాబాద్ లో ఆల్ టైం హైకి బంగారం ధరలు

బంగారం.. దసరా ముగుస్తున్న టైంలో.. షాక్ ఇచ్చింది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధరగా.. బంగారం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరటం, అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలతో పెట్టుబడిదారులు అందరూ.. బంగారం వైపు మళ్లటంతో.. ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంత ధర.. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండటం విశేషం. ఇది ఆల్ టైం హై అంటున్నారు వ్యాపారులు. 

2023, అక్టోబర్ 24వ తేదీ మార్కెట్ ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గోల్డ్.. 10 గ్రాములు 61 వేల 690 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము 6 వేల 169 రూపాయలుగా ఉంది. అదే 22 క్యారెట్ల గోల్డ్.. 10 గ్రాములు 56 వేల 550 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరల్లో ఇది ఆల్ టైం హై అంటున్నారు వ్యాపారులు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1975 డాలర్లుగా నమోదైంది. 

బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో ఆర్థిక వ్యవహారాలు గట్టిగా దెబ్బతిన్నాయి. ఇతర ధరలు సైతం పెరుగుతున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి బెస్ట్ గా భావించటం వల్లే.. ధరలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అనేది అంచనా ఉంది.

ALSO READ :- Health Tip : రన్నింగ్, జంపింగ్ ఏది బెటర్.. ఫిట్ నెస్ కోసం ఏది చేయాలి..?