హైదరాబాద్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,650 దాటింది. ఈ అసాధారణ పెరుగుదల భారతదేశం అంతటా ఉంది. బంగారం ధరలు రాబోయే కొద్దిరోజుల్లోనే లక్ష మార్క్ ను చేరేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు, మార్కెట్ అస్థిరత బంగారం ధరల పెరుగుదలకు కారణం.
శుక్రవారం ( ఫిబ్రవరి 08) హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 79,450 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 87,650 రూపాయలకు చేరింది. గతవారం 24 క్యారెట్ల బంగారం ధర 84,000 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 77,300 రూపాయలుగా ఉంది. దీనితో పోలిస్తే ఇది దాదాపు 4 శాతం పెరిగింది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావించడం..ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తుంది.
బంగారం ధరలను అనేక ప్రపంచం, దేశీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. సుంకాలపై ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక లోటులు ,డీడాలరైజేషన్, ట్రంప్ వాణిజ్య విధానాలు ,భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి.
బంగారం ధరల పెరుగుదల , తగ్గుదల వంటివి అమెరికా వాణిజ్య విధానాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ,ప్రపంచ మార్కెట్ కదలికలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగాలలో ఏవైనా ముఖ్యమైన మార్పులు జరిగితే బంగారం ధరలలో మరింత హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు.