గోల్డ్ ప్రియులకు షాక్..కొనేటట్టు లేదు..80వేల మార్క్ దాటిన బంగారం ధరలు..

బంగారం ధరలు మరోసారి 80వేల మార్క్ ను తాకింది. సోమవారం( జనవరి13, 2025)న 470 రూపాయలు పెరిగి రూ. 80వేలకు చేరింది.  హైదరాబాద్ తో పాటు దేశమంతా బంగారం వెండి ధరలు పెరిగాయి. గత వారం రోజులు హెచ్చు తగ్గులను చూస్తున్న పసిడి ధరలు. గత రెండు రోజులగా పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం..సేఫ్టీ ఇన్వెస్ట్ మెంట్ మెటల్ కావడంతో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 

సోమవారం నాడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,400గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.80,070కి చేరుకుంది. నిన్న ఆదివారం 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73వేలు ఉండగా.. 400 రూపాయలు పెరిగి.. 73వేల 400లకు చేరింది.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79వేల 640 ఉండగా.. 430 రూపాయలు పెరిగి రూ. 80వేల 0740కి పెరిగింది. 

ALSO READ | భోగి మంటల్లో..10 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద మటాష్..పెట్టుబడిదారుల రక్త కన్నీరు

జనవరి నెల ప్రారంభంతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరలు 2.65 శాతం పెరుగుదల కనిపిస్తుంది. జనవరి ప్రారంభంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71వేల 500 కాగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.78వేలుగా ఉంది. 

సోమవారం 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 400  లు పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 430 లు పెరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి.