
యూఎస్ టారిఫ్ వార్ కారణంగా మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు భారీ పెరిగాయి. చైనా-యూఎస్ ట్రేడ్ సృష్టించిన భయాలతో చాలా దేశాలు బంగారం నిల్వలు పెంచుకునే పనిలో పడ్డాయి. దీంతో ఇండియాలో గోల్డ్ రేట్లు మొట్టమొదటి సారి లక్ష రూపాయల మార్క్ ను దాటేశాయి. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారం నిల్వలు పెంచుకుంది. దీంతో సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి కూర్చుంది. అయితే ఆల్ టైమ్ హైకి చేరిన గోల్డ్ ను కొనేందుకు మార్కెట్లో ఆసక్తి తగ్గిపోవడం, ట్రేడ్ వార్ కు కాస్త బ్రేక్ పడిన సంకేతాలతో బంగారం ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి.
ఇవాళ ( సోమవారం, ఏప్రిల్, 28) హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ రూ.680 తగ్గింది. దీంతో స్పాట్ మార్కెట్ లో 97,530 పలుకుతోంది. ఆదివారం రూ.98,210 గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.620 తగ్గి 89,400 కు చేరుకుంది. ఆదివారం రూ.90,020 గా ఉంది. ఆల్ టైమ్ హై విలువ లక్ష13 వందల50 రూపాల నుంచి ఇవాళ్టి ధర (ఏప్రిల్ 28) ను పోల్చిప్పుడు బంగారం రూ.3150 కు తగ్గింది.
గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, యూఎస్ మాంద్యం భయాల మధ్య గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ రేటు మంగళవారం రూ. 1 లక్ష మార్కును కూడా దాటింది. అయితే.. డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్‌లను సడలిస్తానని ప్రకటించడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గోల్డ్ ధరలు గత మూడు రోజులుగా డౌన్ ఫాల్ అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. లాంగ్ టెర్మ్‌లో మాత్రం ధరలు పెరుగుతాయని.. సో రేట్లు తగ్గినప్పుడే కొనుక్కునేందుకు మంచి అవకాశమని సూచించారు.