Today Gold Rate: బంగారం వెంటనే కొనుక్కోండి.. ఇప్పట్లో మళ్లీ ఇంత తగ్గకపోవచ్చు..!

Today Gold Rate: బంగారం వెంటనే కొనుక్కోండి.. ఇప్పట్లో మళ్లీ ఇంత తగ్గకపోవచ్చు..!

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ (మంగళవారం, నవంబర్ 12, 2024) బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 1,470 రూపాయలు తగ్గింది. నిన్న (నవంబర్ 11, 2024) 78,760 రూపాయలు ఉండగా ఇవాళ (నవంబర్ 12, 2024) 77,290 రూపాయలకు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుతూ ఉండటం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమే. 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 70,850 రూపాయలకు తగ్గింది. 

నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,350 రూపాయలు తగ్గింది. ఇక.. వెండి ధరల విషయానికొస్తే కేజీ వెండి ధర లక్ష రూపాయలు దాటిన దశ నుంచి ప్రస్తుతం రూ.91,000కు తగ్గింది. ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధరపై 2 వేల ధర తగ్గింది. భారత దేశంలో బంగారం, వెండి ధరలు డాలర్తో రూపాయి విలువతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన బంగారం, వెండి ధరలు నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి.

ALSO READ | Hyundai Motor Q2 Results:16 శాతం తగ్గిన హ్యుందాయ్ మోటార్ నికర లాభం

భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, బంగారానికి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, సరఫరాలో మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు.  ఇండియాలో బంగారానికి డిమాండ్ బలంగా ఉంది. పసిడికి సాంస్కృతిక,  మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో దీనిని భారీగా కొంటారు. చాలా మందికి దీనిని సురక్షితమైన ఆస్తిగా చూస్తారు.