ఇలా అయితే ఏం కొంటారో.. బంగారం ధర పెరిగింది.. ఇందుకు కారణం ఇది..

ఇలా అయితే ఏం కొంటారో.. బంగారం ధర పెరిగింది.. ఇందుకు కారణం ఇది..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.79,700లకు చేరింది. జ్యూయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్​ పెరగడం, రూపాయి విలువ తగ్గడం ఇందుకు కారణాలని ఆలిండియా సరాఫా అసోసియేషన్​ ప్రకటించింది. సోమవారం పది గ్రాముల ధర రూ.70 వేలు పలికింది. కిలో వెండి ధర మంగళవారం 1,300 పెరిగిన మూడు వారాల గరిష్టం రూ.92 వేలకు చేరింది.

99.5 స్వచ్ఛత గల పుత్తడి ధర రూ.700 పెరిగి రూ.79,300లకు ఎగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ మంగళవారం ఐదు పైసలు తగ్గి 85.73లకు పడిపోయింది. క్రూడాయిల్ ​ధరల పెరుగుదల, విదేశీ నిధులు వెళ్లిపోవడం వల్ల కూడా రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది.