హోలీ రోజు భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో 90 వేలకు దగ్గర్లో తులం రేటు

హోలీ రోజు భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో 90 వేలకు దగ్గర్లో తులం రేటు

హోలీ పండుగ రోజు హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధరపై 12 వందల రూపాయలు పెరిగింది. దీంతో.. గురువారం 88 వేల 580 రూపాయలు ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. శుక్రవారం 89 వేల 780 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా 11 వందల రూపాయలు పెరిగి 81 వేల 200 రూపాయల నుంచి 82 వేల 300 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 90 వేలకు కేవలం 220 రూపాయల దూరంలోనే ఉంది. మార్చి నెలాఖరు నాటికి తులం బంగారం ధర 90 వేల రూపాయలు దాటి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Also Read:-24క్యారెట్ల గ్లోడ్ స్వీట్స్ ఎప్పుడైనా చూశారా.. కేజీ రూ. 50వేలు

బంగారానికి డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్ పతనమవుతుండటం, ద్రవ్యోల్పణం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మందగమనం, అమెరికా వాణిజ్య విధానంలో ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు.. ఇలా పలు కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా పసిడికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. 

Also Read:-సంస్కారవంతమైన సోప్ ట్రిఫుల్ ఎక్స్ అధినేత ఇక లేరు.. ఆయన ఆస్తి ఎంతో తెలుసా..?

గ్లోబల్‌‌గా అనిశ్చితి నెలకొనడడంతో ఇన్వెస్టర్లు షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్స్‌‌ నుంచి ఫండ్స్ విత్‌‌డ్రా చేసుకుంటున్నారని, గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌‌లో పెడుతున్నారని అనలిస్టులు చెబుతున్నారు. బంగారం ధరలను ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, దేశీయ అంశాలు ప్రభావితం చేస్తాయన్న సంగతి తెలిసిందే. సుంకాలపై ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక లోటులు, డీడాలరైజేషన్, ట్రంప్ వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి.