
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 2023 అక్టోబర్ 17 రోజు నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 54 వేల 590 కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 59 వేల 950 కు చేరుకుంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55 వేల 100 గా ఉండగా .. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేల 100 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల 950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 950గా ఉంది.
హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేల 950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59 వేల 950గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేల 950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59 వేల 950గా ఉంది.
- ALSO READ | మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ కొనసాగుతుండడంతో పెరిగిన గోల్డ్ ధరలు..
ఇక పండగల సమయంలో బంగారాన్ని కొనడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. మరివారం రోజుల్లో విజయదశమి పండగ ఉండటంతో నగరంలోని బంగారం షాపులన్ని కిటకిటలాడుతున్నాయి. రెండు రోజులుగా ధరలు రూ. 500 వరకు తగ్గుముఖం పట్టడంతో ఎక్కువమంది బంగారు ఆభరణాలను కొనేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఇర రాబోయే వారం రోజుల్లో ధరలు మరి ఇంతతగ్గకున్నా పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.