పండగ ముందు బంగారం ధర పరుగులు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు

పండగ ముందు బంగారం ధర పరుగులు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు

గత కొద్ది రోజుల ముందు బంగారం ధరలు తగ్గినట్టుగానే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. అక్టోబర్ లో పండుగలు, ఫంక్షన్లు ఎక్కువగా ఉండటంతో గోల్డ్ కు కాస్త డిమాండ్ పెరిగింది. గురువారం (అక్టోబర్ 3)న అంతకు ముందు రోజుతో పోల్చితే బంగారం ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 22, 24 క్యారెట్ల బంగారంపై భారీగా ధరలు పెరిగాయి. పసిడి ధర పరుగుతు పెడుతుంటే వెండి ధర మాత్రమే గత ఐదు రోజుల నుంచి స్థిరంగా ఉంది. కేజీ వెండి రూ.95వేలుగా ఉంది.

హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ.71,100 ఉండగా నిన్నటి కంటే రూ.100 ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రేటు రూ.77,560 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ. 660 పెరిగాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్లు వరుసగా (22 క్యారెట్స్ 10గ్రా) రూ.71,250, (24 క్యారెట్స్ 10గ్రా) తులం రూ.77.710  వద్ద ఉన్నాయి. ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలపై రూ.100, రూ.110 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.