
గోల్డ్ రేట్స్ సమాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాస్త తగ్గితే కొందామని ఎదురు చూసే వాళ్లకి నిరాశే ఎదురవుతోంది. మళ్లీ హైదరాబాద్ లో బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) హైదరాబాద్ లో గోల్డ్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.550 పెరిగి ఇవాళ రూ.86,620 దగ్గరకు చేరుకుంది. నిన్న 86,070 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.500 పెరిగి ఇవాళ రూ.79,400 దగ్గరకు చేరుకుంది. నిన్న 78,900 గా ఉంది.
శనివారం బంగార ధరలు తగ్గుదల మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ లో కొంత ఊరటనిచ్చింది.. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.. జనవరి నెలలో 8శాతం బంగారం ధరలు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల హెచ్చుతగ్గులు, డాలర్ విలువ పెరగడం, ట్రంప్ నిర్ణయాలు దేశీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.