
Gold Price Today: ట్రంప్ తాత్కాలికంగా సుంకాలను 90 రోజుల వరకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పసిడి ధరల ర్యాలీ తిరిగి పుంజుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటంతో పాటు.. 2025లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పెరగడంతో పెట్టుబడిదారులకు గోల్డ్ ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారిపోయింది. ట్రంప్ ఏ నిమిషంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే భయాలతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును సేఫ్ హెవెన్ బంగారంలోకి తరలిస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.18వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 745, ముంబైలో రూ.8వేల 745, దిల్లీలో రూ.8వేల 760, కలకత్తాలో రూ.8వేల 745, బెంగళూరులో రూ.8వేల 745, కేరళలో రూ.8వేల 745, పూణేలో రూ.8వేల 745, వడోదరలో రూ.8వేల 750, జైపూరులో రూ.8వేల 760, లక్నోలో రూ.8వేల 760, మంగళూరులో రూ.8వేల 745, నాశిక్ లో రూ.8వేల 747, అయోధ్యలో రూ.8వేల 760, బళ్లారిలో రూ.8వేల 745, గురుగ్రాములో రూ.8వేల 760, నోయిడాలో రూ.8వేల 760 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.20వేల 200 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 540, ముంబైలో రూ.9వేల 540, దిల్లీలో రూ.9వేల 555, కలకత్తాలో రూ.9వేల 540, బెంగళూరులో రూ.9వేల 540, కేరళలో రూ.9వేల 540, పూణేలో రూ.9వేల 540, వడోదరలో రూ.9వేల 545, జైపూరులో రూ.9వేల 555, లక్నోలో రూ.9వేల 555, మంగళూరులో రూ.9వేల 540, నాశిక్ లో రూ.9వేల 543, అయోధ్యలో రూ.9వేల 555, బళ్లారిలో రూ.9వేల 540, గురుగ్రాములో రూ.9వేల 555, నోయిడాలో రూ.9వేల 555గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.87వేల 450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులం(10 గ్రాములకు) రూ.95వేల400గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 పెరిగి రూ.లక్ష 8వేల వద్ద కొనసాగుతోంది.