గత కొద్ది రోజులుగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇవాళ (ఫిబ్రవరి 6) స్థిరంగా ఉన్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) 1040 రూపాయలు పెరిగిన గోల్డ్.. గురువారం 1 గ్రాములపై 1 రూపాయి పెరిగి స్థిరంగా కొనసాగుతోంది.
బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹79,050 రూపాయలు ఉండగా.. ఇవాళ ₹79,060 గా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ హైదరాబాద్ లో రూ.86,250 గా ఉంది. నిన్న (బుధవారం) 86,240 రూపాయలుగా ఉంది.
గత పదిరోజుల్లో బంగారం ధర జనవరి 27, జనవరి 28, ఫిబ్రవరి 3న మాత్రమే తగ్గింది. మిగిలిన ఏడు రోజుల్లో ఫిబ్రవరి 2న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా కాకపోయినా బంగారం ధరలు ఆరు రోజులు అమాంతం పెరిగి ప్రస్తుతం పసిడిని అత్యంత ప్రియమైందిగా మార్చేశాయి.
జనవరి 27న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,250 రూపాయలు. ఫిబ్రవరి 5న 86,240 రూపాయలు. పది రోజుల్లో 3990 రూపాయలు పెరిగింది. ఈ లెక్కన ఫిబ్రవరి ముగిసే లోపు బంగారం ధర 90 వేల మార్క్ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో వెళుతుండటం గమనార్హం.