
Gold Price Today: గతవారం మధ్య నుంచి పసిడి ధరలు మెగా ర్యాలీని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది, రంజాన్ వంటి పండుగలు వారాంతంలో వచ్చిన వేళ గోల్డ్, వెండి ఆభరణాల షాపింగ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే మీ నగరంలోని రిటైల్ మార్కెట్లలో నేడు పెరిగిన ధరలను దీనికి కోసం తప్పకుండా తెలుసుకోవటం చాలా ముఖ్యం.
స్పాట్ మార్కెట్లో గోల్డ్ మెగా ర్యాలీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలపై పరస్పర పన్నులు విధించే విషయంలో వెనకాడేది లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఏప్రిల్ 2, 2025 నుంచి కొత్త సుంకాలను అమలులోకి తెస్తున్నారు. ఈ చర్యలు ఆర్థిక పతనానికి దారితీసే ప్రమాదం ఉండటంతో పాటు ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రజలను తమ డబ్బును సేఫ్ హెవెన్ బంగారంలోకి మళ్లించేలా చేస్తున్నాయి. దీంతో సోమవారం స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3వేల 106 డాలర్ల స్థాయిని అధిగమించింది. మెుత్తానికి 2025 ప్రారంభం నుంచి గోల్డ్ ధర 18 శాతం పెరుగుదలను చూడటానికి ట్రంప్ చర్యలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6వేల 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ మార్కెట్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల425, ముంబైలో రూ.8వేల 425, దిల్లీలో రూ.8వేల 374, కలకత్తాలో రూ.8వేల 425, బెంగళూరులో రూ.8వేల 425, కేరళలో రూ.8వేల 425, జైపూరులో రూ.8వేల 374, వడోదరలో రూ.8వేల 364, మంగళూరులో రూ.8వేల 539, నాశిక్ లో రూ.8వేల 362, అయోధ్యలో రూ.8వేల 374, బళ్లారిలో రూ.8వేల 359, గురుగ్రాములో రూ.8వేల 374, నోయిడాలో రూ.8వేల 374గా కొనసాగుతున్నాయి.
Also Read:-హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజులు భారీగా తగ్గింపు
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.7 వేల 100 పెరుగుదలను చూసింది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ మార్కెట్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల191, ముంబైలో రూ.9వేల191, దిల్లీలో రూ.9వేల134, కలకత్తాలో రూ.9వేల191, బెంగళూరులో రూ.9వేల191, కేరళలో రూ.9వేల191, జైపూరులో రూ.9వేల134, వడోదరలో రూ.9వేల124, మంగళూరులో రూ.9వేల119, నాశిక్ లో రూ.9వేల122, అయోధ్యలో రూ.9వేల134, బళ్లారిలో రూ.9వేల119, గురుగ్రాములో రూ.9వేల134, నోయిడాలో రూ.9వేల134 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8185 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.8929గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1,13,000 వద్ద కొనసాగుతోంది.