Gold Rate: రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో రూ.లక్షకు దగ్గరగా తులం..

Gold Rate: రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో రూ.లక్షకు దగ్గరగా తులం..

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ ప్రభావంపై ఫెడ్ చైర్మెన్ పావెల్ స్పందించారు. సుంకాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగితను అదుపులో ఉంచేందుకు చేసే ప్రయత్నాలను దెబ్బతీయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ.. ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పాలసీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు ఇప్పటికే డాలర్ బలహీనపడటం వల్ల కూడా స్పాట్ మార్కెట్లలో గోల్డ్ సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకిన సంగతి తెలిసిందే. అయితే రిటైల్ షాపింగ్ చేయటానికి ముందు కొనుగోలుదారులు నేటి ధరలను తప్పక పరిశీలించాల్సి ఉంటుంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10వేల 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది.  దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8వేల 920, ముంబైలో రూ.8వేల 920, దిల్లీలో రూ.8వేల 935, కలకత్తాలో రూ.8వేల 920, బెంగళారులో రూ.8వేల 920, కేరళలో రూ.8వేల 920, పూణేలో రూ.8వేల 920, వడోదరలో రూ.8వేల 925, జైపూరులో రూ.8వేల 935, లక్నోలో రూ.8వేల 935, మంగళూరులో రూ.8వేల 920, నాశిక్ లో రూ.8వేల 923, అయోధ్యలో రూ.8వేల 935, బళ్లారిలో రూ.8వేల 920, గురుగ్రాములో రూ.8వేల 935, నోయిడాలో రూ.8వేల 935 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.11వేల 400 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.9వేల 731, ముంబైలో రూ.9వేల 731, దిల్లీలో రూ.9వేల 746, కలకత్తాలో రూ.9వేల 731, బెంగళారులో రూ.9వేల 731, కేరళలో రూ.9వేల 731, పూణేలో రూ.9వేల 731, వడోదరలో రూ.9వేల 736, జైపూరులో రూ.9వేల 746, లక్నోలో రూ.9వేల 746, మంగళూరులో రూ.9వేల 731, నాశిక్ లో రూ.9వేల 734, అయోధ్యలో రూ.9వేల 746, బళ్లారిలో రూ.9వేల 731, గురుగ్రాములో రూ.9వేల 746, నోయిడాలో రూ.9వేల 746గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.89వేల 200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు  తులం(10 గ్రాములకు)  రూ.97వేల310గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 స్వల్ప తగ్గుదలతో రూ.లక్ష 10వేల వద్ద  కొనసాగుతోంది.