
Gold Price Today: ఉగాదికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో చాలా మంది తెలుగించి ఆడపడుచులు కొత్త తెలుగు సంవత్సరాదికి బంగారం, వెండి వంటి ఆభరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ పసిడి ధరల ర్యాలీతో వారు ఆందోళన చెందుతున్నారు. పండుగ తర్వాత రేట్లు తగ్గే అవకాశం ఉంటుందా అనే గందరగోళంలో వారు ఉన్నారు.
అసలు బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయ్..
2025 ప్రారంభం నుంచే బంగారం రేట్లలో పెరుగుదలను నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు సృష్టిస్తున్న ప్రకంపనలు దీని వెనుక ముఖ్యమైన కారణంగా ఉంది. అలాగే ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ తీసుకొస్తున్న కొత్త టారిఫ్స్ అమలు భయాలు పెట్టుబడిదారులను ఈక్విటీల నుంచి బంగారంలోకి తమ ఇన్వెస్ట్మెంట్లను షిఫ్ట్ చేసేలా ప్రేరేపిస్తున్నాయి. దీనికి అదనంగా ఇండియా, చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకునేందుకు చేస్తున్న కొనుగోళ్లు కూడా గోల్డ్ రేట్ల ర్యాలీకి కారణంగా నిలుస్తున్నాయి.
నేడు 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2వేలు భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల360, ముంబైలో రూ.8వేల360, దిల్లీలో రూ.8వేల375, కలకత్తాలో రూ.8వేల360, బెంగళూరులో రూ.8వేల360, కేరళలో రూ.8వేల360, వడోదరలో రూ.8వేల365, జైపూరులో రూ.8వేల375, మంగళూరులో రూ.8వేల360, నాశిక్ లో రూ.8వేల363, అయోధ్యలో రూ.8వేల375, గురుగ్రాములో రూ.8వేల375, నోయిడాలో రూ.8వేల375 వద్ద కొనసాగుతున్నాయి.
►ALSO READ | Mutual Funds: బ్యాంక్ వడ్డీకి మూడింతల రాబడి.. లాభాలు కుమ్మరించిన ఫండ్..a
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల200 భారీ పెరుగుదలను చూశాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల120, ముంబైలో రూ.9వేల120, దిల్లీలో రూ.9వేల135, కలకత్తాలో రూ.9వేల120, బెంగళూరులో రూ.9వేల120, కేరళలో రూ.9వేల120, వడోదరలో రూ.9వేల125, జైపూరులో రూ.9వేల135, మంగళూరులో రూ.9వేల120, నాశిక్ లో రూ.9వేల123, అయోధ్యలో రూ.9వేల135, గురుగ్రాములో రూ.9వేల135, నోయిడాలో రూ.9వేల135 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల360 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల120గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 తగ్గి రూ.1,13,000 వద్ద కొనసాగుతోంది.