
Gold Price Today: వారం ప్రారంభంలో స్వల్ప ఊరటను కలిగించిన పసిడి ధరలు నిన్నటి నుంచి తిరిగి పెరుగుదలను చూస్తున్నాయి. ప్రధానంగా ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్న ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్ గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించటం భయాలను పెంచుతోంది. ఇది మళ్లీ ద్రవ్యోల్బణాన్ని తారా స్థాయిలకు ప్రేరేపించవచ్చనే భయాల నడుమ ప్రజల నుంచి సెంట్రల్ బ్యాంకుల వరకు తమ డబ్బును సేఫ్ హెవెన్ బంగారంలో పెట్టుబడిగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో 2025 ప్రారంభం నుంచి స్పాట్ మార్కెట్లలో పసిడి ధరలు దాదాపు 15 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావంపై అనిశ్చితితో పాటుగా ఈ ఏడాది యూఎస్ ఫెడ్ రేటు కోతల అంచనాలు బంగారం ధరలను అధిక స్థాయిలో ఉంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు తప్పనిసరిగా పెరిగిన రిటైల్ ధరలను పరిశీలించటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో నేడు దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8235, ముంబైలో రూ.8235, దిల్లీలో రూ.8250, కలకత్తాలో రూ.8235, బెంగళూరులో రూ.8235, కేరళలో రూ.8235, వడోదరలో రూ.8240, జైపూరులో రూ.8250, లక్నోలో రూ.8250, మంగళూరులో రూ.8196, నాశిక్ లో రూ.8199, నోయిడాలో రూ.8211, అయోధ్యలో రూ.8211 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4,400 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8948, ముంబైలో రూ.8948, దిల్లీలో రూ.8999, కలకత్తాలో రూ.8948, బెంగళూరులో రూ.8948, కేరళలో రూ.8948, వడోదరలో రూ.8989, జైపూరులో రూ.8999, లక్నోలో రూ.8999, మంగళూరులో రూ.8941, నాశిక్ లో రూ.8944, నోయిడాలో రూ.8956, అయోధ్యలో రూ.8956గా ఉన్నాయి.
ALSO READ : మరో బాంబు పేల్చిన ట్రంప్: విదేశీ కార్లపై భారీగా దిగుమతి సుంకం..
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8235 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.8984గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1,11,000 వద్ద కొనసాగుతోంది.