Gold Rate: షాకింగ్: భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో తులం రేటెంతంటే..?

Gold Rate: షాకింగ్: భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో తులం రేటెంతంటే..?

Gold Price Today: గడచిన 5 రోజులుగా తగ్గుదలను చూసిన బంగారం ధరలు నేడు తిరిగి పురోగమించటం స్టార్ట్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 104 శాతం సుంకాలను ప్రకటించి చైనాపై వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వటంతో బులియన్ మార్కెట్లలో బుల్ జోరు మెుదలైంది. ప్రస్తుత టారిఫ్స్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం అయ్యే పరిణామాలపై నిపుణులు, ఆర్థిక వేత్తలు, వ్యాపారులు, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆందోళనలతో బంగారానికి తిరిగి డిమాండ్ పుంజుకోవటం ఈ పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న చాలా మందికి అనూహ్యంగా పెరిగిన ధరలు షాక్ ఇచ్చాయి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.6వేల 500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 290, ముంబైలో రూ.8వేల 290, దిల్లీలో రూ.8వేల 305, కలకత్తాలో రూ.8వేల 290, బెంగళూరులో రూ.8వేల 290, కేరళలో రూ.8వేల 290, పూణేలో రూ.8వేల 290, వడోదరలో రూ.8వేల 229, జైపూరులో రూ.8వేల 305, మంగళూరులో రూ.8వేల 290, నాశిక్ లో రూ.8వేల 293, మైసూరులో రూ.8వేల 290, అయోధ్యలో రూ.8వేల 305, గురుగ్రాములో రూ.8వేల 305, బళ్లారిలో రూ.8వేల 290, నోయిడాలో రూ.8వేల 305 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7వేల100 పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 044, ముంబైలో రూ.9వేల 044, దిల్లీలో రూ.9వేల 059, కలకత్తాలో రూ.9వేల 044, బెంగళూరులో రూ.9వేల 044, కేరళలో రూ.9వేల 044, పూణేలో రూ.9వేల 044, వడోదరలో రూ.9వేల 049, జైపూరులో రూ.9వేల 059, మంగళూరులో రూ.9వేల 044, నాశిక్ లో రూ.9వేల 047, మైసూరులో రూ.9వేల 044, అయోధ్యలో రూ.9వేల 059, గురుగ్రాములో రూ.9వేల 059, బళ్లారిలో రూ.9వేల 044, నోయిడాలో రూ.9వేల 059గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం(10 గ్రాములు) రూ.82వేల 900 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులం(10 గ్రాములు) రూ.90వేల440గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రూ.వెయ్యి తగ్గి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 2వేల వద్ద విక్రయించబడుతోంది.