
బంగారం ధరలు గత కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. కాస్త తగ్గితే కొందాం అనుకునే వారికి నిరాశే మిగిలిస్తూ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అయితే తాజాగా గోల్డ్ రేట్లు కాస్త దిగి రావడం పసిడి ప్రియులకు శుభవార్త.
ఇవాళ (ఫిబ్రవరి 22) దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగి రావడంతో హైదరాబాద్ లోనూ తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 330 తగ్గి రూ. 87,770 కి చేరుకుంది. శుక్రవారం రూ.88,100 వద్ద ఉన్న ధర 330 రూపాయలకు తగ్గింది. సాధారణ ప్రజలు వాడే ధరలో తగ్గుదల కలిసొచ్చే అంశం.
అయితే హోల్ సేల్ ధరలు మాత్రం తగ్గలేదు. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.200 పెరిగింది. శుక్రవారం రూ.80,250 ధర 200 పెరగడంతో రూ.80,450 కు చేరుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితితో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ పెట్టుబడులు బంగారం వైపుకి వెళుతున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్, బాండ్స్ లో ఆదాయం పెరుగుదల, రూపాయి క్షీణించడంతో ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ పెద్ద ఎత్తున జరుగుతూఉంది. ఫారిన్ పెట్టుబడుదారులు అమ్ముకుంటున్న వేళ.. ఇండియాలో బంగారంలోకి పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకుంటుండటంతో గోల్డ్ ఆల్ టైమ్ హై దిశగా పయనిస్తోంది.