
వరుసగా ఓ మూడు నాలుగు రోజులు తగ్గుతూ కాస్త ఉపశమనం కలిగించిన బంగారం ధరలు.. మంగళవారం (ఏప్రిల్ 29) మళ్లీ పెరగాయి. దీంతో ఇవాళ (బుధవారం ) అక్షయ తృతీయ సందర్భంగా మరింత పెరుగుతాయేమో అనే అనుమానాలు సామాన్యులలో నెలకొన్నాయి. అక్షయ తృతీయ రోజు కచ్చితంగా బంగారం కొనాలనే సెంటిమెంట్ ప్రజలలో ఉండటంతో.. ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ధరలు భారీగా పెరగటంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేనట్లుగా కనిపిస్తోంది. దీంతో హైదరాబాదులో ఇవాళ (బుధవారం) గోల్డ్ రేట్లు ఊహించిన భారీ మొత్తంలో పెరగలేదు.
బుధవారం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల్లో పెద్దగా మార్పులేమీ లేవు. కేవలం 60 రూపాయలు తగ్గి రూ.97,910 గా ఉంది. అదే ధర మంగళవారం 97,970 రూపాయల దగ్గర ఉంది.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా దాదాపు అక్కడే ఉంది. 10 గ్రాములకు హైదరాబాదు లో రూ.89,750 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై కేవలం 50 రూపాయలు మాత్రమే తగ్గింది.
గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఏప్రిల్ 29న10 గ్రాములపై 6వేల 770 రూపాయలు పెరిగింది. అంటే మంగళవారం 97,970 గా ఉన్న ధరలు బుధవారం (ఇవాళ) 97,910 కి చేరుకున్నాయి. అంటే.. నెల రోజుల వ్యవధిలో.. బంగారం ధరలు ట్రంప్ దెబ్బకు యూఎస్ ఎకానమీ రెసిషన్‌లోకి జారుకుంటుందనే భయాలతో గోల్డ్ వైపు ఆకర్షితులవుతున్న ఇన్వెస్టర్లు .. బుధవారం కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అయితే అక్షయ తృతీయ కారణంగా మధ్యాహ్నం వరకు బంగారం కొనుగోళ్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.