Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే..

ఈ వారంలో మూడుసార్లు తగ్గిన బంగారం ధరలు ఇవాళ ( సెప్టెంబర్ 5, 2024 ) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 5రోజుల నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న కారణంగా డాలర్ రేటు క్రమంగా పెడుతోంది.. ఈ క్రమంలో బంగారం రేట్లు దిగొస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు గత మూడురోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

వివిధ మార్కెట్లలో బంగారం ధరలు: 

హైదరాబాద్ మార్కెట్లో:

ఇవాళ ( సెప్టెంబర్ 5, 2024 ) హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ పసిడి ధర స్థిరంగా తులం రూ. 66,700 గా ఉంది. అంతకుముందు రూ. 250 ఒకసారి తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను రూ. 72,770గా ఉంది.

Also Read :- రాబోయే ఐదేళ్లు కష్టమే జేబులో పైస లేక పరేశాన్

ఢిల్లీ మార్కెట్లో:

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు గాను రూ. 66,850గా ఉంది.

బెంగళూరు మార్కెట్లో:

బెంగళూరు మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ.67,330గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను 73,505

చెన్నై మార్కెట్లో:

చెన్నై మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ.67135గా ఉంది.24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను 73,29గా ఉంది.

ముంబై మార్కెట్లో:

ముంబై మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ.67004గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను రూ. 73149గా ఉంది.