Gold Rate: ట్రంప్ దెబ్బకు ఆకాశానికి గోల్డ్.. ఇవాళ రూ.5వేల 400 అప్, హైదరాబాద్ రేట్లివే..

Gold Rate: ట్రంప్ దెబ్బకు ఆకాశానికి గోల్డ్.. ఇవాళ రూ.5వేల 400 అప్, హైదరాబాద్ రేట్లివే..

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై ప్రకటించిన వాణిజ్య సుంకాలు నేటి నుంచి అమలులోకి వచ్చిన వేళ పసిడి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకేశాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రికార్డు గరిష్ఠాన్ని తాకి రూ.91వేల 423కి తాకాయి. ఇదే క్రమంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు స్పాట్ మార్కెట్లో 3వేల170 డాలర్లకు పైగా ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ముందస్తు జాగ్రత్తలో భాగంగా బంగారంలోకి తమ పెట్టుబడులను తరలించటం రేట్ల పెంపుకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదే క్రమంలో బాండ్ ఈల్డ్స్ ఐదున్నర నెలల దిగువకు జారుకున్నాయి. అంటే ఎక్కువ మంది ప్రస్తుతం బంగారంలో పెట్టుబడులకు మెుగ్గుచూపుతున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. అమెరికాలోకి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుమీద 10 శాతం బేస్ టారిఫ్స్ విధించారు ట్రంప్. దీంతో దేశీయ రిటైల్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు భారీగా పెరుగుదలను చూస్తున్నాయి. కొనుగోలుదారులు ఇందుకోసం ముందుగానే రిటైల్ ధరలను గమనించటం ఉత్తమం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5వేలు భారీ పెంపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 560, ముంబైలో రూ.8వేల 560, దిల్లీలో రూ.8వేల 575, కలకత్తాలో రూ.8వేల 560, బెంగళూరులో రూ.8వేల 560, కేరళలో రూ.8వేల 560, వడోదరలో రూ.8వేల 565, జైపూరులో రూ.8వేల 575, కోయంబత్తూరులో రూ.8వేల 560, మంగళూరులో రూ.8వేల 560, నాశిక్ లో రూ.8వేల 563, అయోధ్యలో రూ.8వేల 575, బళ్లారిలో రూ.8వేల 560, నోయిడాలో రూ.8వేల 575, గురుగ్రాములో రూ.8వేల 575 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల 400 పెరుగుదలను చూశాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 338, ముంబైలో రూ.9వేల 338, దిల్లీలో రూ.9వేల 353, కలకత్తాలో రూ.9వేల 338, బెంగళూరులో రూ.9వేల 338, కేరళలో రూ.9వేల 338, వడోదరలో రూ.9వేల 343, జైపూరులో రూ.9వేల 353, కోయంబత్తూరులో రూ.9వేల 338, మంగళూరులో రూ.9వేల 338, నాశిక్ లో రూ.9వేల 341, అయోధ్యలో రూ.9వేల 353, బళ్లారిలో రూ.9వేల 338, నోయిడాలో రూ.9వేల 353, గురుగ్రాములో రూ.9వేల 353గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 560 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల 338గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 13వేల 900 వద్ద విక్రయించబడుతోంది.