
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం ధర తిరిగి రూ.89 వేలకు చేరింది. 99.9 శాతం ప్యూరిటీ గల పది గ్రాముల పుత్తడి ధర మంగళవారం ఒక్క రోజే రూ.1,100 పెరిగింది. 99.5 శాతం ప్యూరిటీ గల బంగారం రేటు కూడా రూ.1,100 పెరిగి రూ.87,500లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.98 వేలకు ఎగిసింది.
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్డెలివరీ కాంట్రాక్టుల రేటు పది గ్రాములకు రూ.806 పెరిగి రూ.86,190లకు చేరింది. కెనడా, మెక్సికో, కెనడాపై అమెరికా సుంకాలు పెంచడంతో బులియన్ధరలు దూసుకెళ్లాయని ట్రేడర్లు చెప్పారు. తామూ సుంకాలు పెంచుతామని చైనా, కెనడా ప్రకటించడంతో టారిఫ్వార్ ముదిరింది.