ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు.. 10గ్రాములు ఎంతంటే..

ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు.. 10గ్రాములు ఎంతంటే..

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో కూడా స్వల్పంగా పెరిగిన బంగారం సోమవారం ( అక్టోబర్ 14, 2024 ) ఏకంగా రూ. 600 పెరగడంతో 10 గ్రాముల బంగారం 78 వేల 700కు చేరి ఆల్ టైం హైను టచ్ చేసింది.అక్టోబర్ లో పండుగలు, ఫంక్షన్లు ఎక్కువగా ఉండటంతో గోల్డ్ కు కాస్త డిమాండ్ పెరిగింది. అయితే..  మంగళవారం ( అక్టోబర్ 15, 2024 ) నూదయం రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర సోమవారం కంటే... రూ. 10 మేరకు తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే తగ్గి కిలో రూ. 100  తగ్గింది.

హైదరాబాద్‌,విజయవాడ,విశాఖపట్నంలో మంగళవారం ( అక్టోబర్ 15, 2024 ) ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 71,140గా ఉండగా..  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 77,610గా నమోదయ్యింది.

దసరా సమయంలో తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన వెండి ధరలు.. మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గింది.  ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో మంగళవారం కిలో వెండి ధర రూ. 1,02,900గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లలో కిలో రూ. 96,900గా నమోదయ్యింది.