15 తులాల బంగారం చోరీ

15 తులాల బంగారం చోరీ

మల్యాల, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంట్లోగుర్తు తెలియని వ్యక్తులు బంగారు వస్తువులు ఎత్తుకెళ్లారు. మల్యాల మండలం మద్దట్ల గ్రామానికి చెందిన సామల్ల దేవయ్య తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటికి తాళం వేసి నెల రోజులుగా మల్యాలలోని కూతురు ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా తాళాలు పగులగొట్టి కనిపించాయి. ఇంట్లో ఉన్న 15 తులాల బంగారం కనిపించలేదు. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌‌‌‌ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.