బంగారం సేల్స్ అంతంత మాత్రమే..

బంగారం సేల్స్ అంతంత మాత్రమే..
  •     ఎన్నికల కోడ్, రేట్లు పెరగడంతో తగ్గిన కొనుగోళ్లు
  •     స్పెషల్​ ఆఫర్లు ఇచ్చినా స్పందన కరువు
  •     గతేడాది అక్షయ తృతీయ నాడు 2,500  కిలోల గోల్డ్ అమ్మకాలు
  •     ఈసారి 50 శాతం పడిపోయాయంటున్న వ్యాపారులు

హైదరాబాబాద్, వెలుగు : ఈసారి అక్షయ తృతీయకు జనం నుంచి పెద్దగా రెస్పాన్స్​రాలేదు. బంగారం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి. రేట్లు పెరగడం, ఎన్నికల కోడ్​అమలులో ఉండడంతో గోల్డ్​సేల్స్​పూర్తిగా డౌన్​అయ్యాయి. గడిచిన 15 రోజుల్లో ఒక్కో జ్యువెలరీ షాపులో రోజుకు తులాల్లోనే అమ్మకాలు జరిగాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో బంగారం కొనేందుకు పెద్దగా ముందుకురావడం లేదని, పాత బంగారాన్ని కూడా

ఎక్స్ చేంజ్ చేసుకోవడం లేదని గోల్డ్​షాపు నిర్వాహకులు చెబుతున్నారు.రూ.50 వేలకు మించి క్యాష్​క్యారీ చేస్తే పోలీసులు సీజ్ చేస్తుండడంతో జనం ఎన్నికలయ్యాక కొనుక్కుందామని ఆగుతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా మంచి సేల్స్ ఉంటాయనుకున్న జ్యువెలరీ షాపు ఓనర్లకు నిరాశే మిగిలింది. గతేడాదితో పోలిస్తే 50 శాతం సేల్స్ తగ్గాయని చెప్పారు.

ఏటా 2 వేల కిలోలు..

ఏటా సిటీలో అక్షయ తృతీయ నాడు దాదాపు 2 వేల కిలోలకు పైగా గోల్డ్ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సిటీలో 200 జ్యువెలరీ షాపులు ఉన్నాయి. ఒక్కో షోరూంలో అక్షయ తృతీయ నాడు 8 నుంచి 15 కిలోల బంగారం అమ్మకాలు జరిగేవి. మొత్తంగా 2,500 కిలోలకు పైగా బంగారం అమ్మేవారు. అయితే శుక్రవారం కేవలం 1,200 కిలోల బంగారం అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెలరీ షాపులు చాలా ఆఫర్లు ఇచ్చాయి. మేకింగ్ ఛార్జీలు లేకుండా, వేస్టేజ్ లో 25 నుంచి 30 శాతం డిస్కౌంట్లు ప్రకటించాయి.

20 రోజులుగా ప్రీ బుక్కింగ్స్ అవకాశం కల్పించాయి. అయితే ఎన్నికల కోడ్​గోల్డ్​సేల్స్​పై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. 2019లో 10 గ్రాముల బంగారం ధర రూ.35,220 ఉండగా, 2020లో రూ.55,550, 2021లో రూ.48,720, 2022లో రూ.52,670, 2023లో రూ.62,435 ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.74వేలు ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.64వేలుగా ఉంది. నెలరోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. లక్ష వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

20 రోజులుగా సేల్స్​ లేవ్​

అక్షయ తృతీయ రోజు గోల్డ్ సేల్స్ అనుకున్నంతగా జరగలేదు. గతేడాదితో పోలిస్తే 40 నుంచి 50 శాతం పడిపోయాయి. ఎన్నికల కోడ్ వల్లనే తగ్గినట్లు కనిపిస్తోంది. గత 20 రోజులుగా పెద్దగా సేల్స్ లేవు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ నిల్వలు పెరుగుతుండటంతో డిమాండ్ పెరిగింది. ఆ ఎఫెక్ట్​రేట్లపై పడింది. రానున్న రోజుల్లో 10 గ్రాముల గోల్డ్​రూ.లక్ష అయ్యే అవకాశం ఉంది. అక్షయ తృతీయ ఆఫర్లు కొనసాగుతున్నాయి.

– రవికాంత్, మానే పల్లి జ్యువెలరీ బ్రాంచ్ మేనేజర్, పంజాగుట్ట