ముషీరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా హైదరాబాద్లోని గాంధీ నగర్ పోలీసులు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కియా కారు నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దోమలగూడ పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ భైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ కిలో బంగారంతో వెహికల్లో ప్రయాణించాడని తెలిపారు.
అతను అదిలాబాద్ కు వెళ్తుండగా తనిఖీల్లో పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సరైన పత్రాలు బిల్లు చూపిస్తే గోల్డ్ వారికే తిరిగి అందజేస్తామని..లేకుంటే ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అప్పగిస్తామని డీసీపీ స్పష్టం చేశారు.