Gold Price: గోల్డ్ లవర్స్కి షాక్..ఆల్ టైం గరిష్టానికి బంగారం ధర

బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్..బంగారం ధరలు భారీగా పెరిగాయి.సోమవారం (ఏప్రిల్ 1) బంగారం ధరలు ఆల్టైం హైక్ను  చూశాయి.దేశవ్యాప్తంగా బంగా రం ధర రూ.68,420లకు చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరరూ. 1070 పెరిగి..రూ. 68,420కి చేరింది. గత ట్రేడింగ్లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,350 వద్ద ముగిసింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర రూ. 63,600 చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీ గా పెరిగాయి. గత ట్రేడింగ్ లో కేజీ వెండి ధర రూ.77,450 ఉండగా..1120 రూపాయలు పెరిగి రూ.78,570 కి చేరింది. 

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే యోచనలో ఉండటంతో బంగారం ధరలు రికార్డ్  స్థాయి పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇది బులియన్ ధరల పెరుగుదల ఊపందుకుంది. మరోవైపు చైనాలో డిమాండ్ కూడా విలువైన బంగారం ధరల పెరుగుదలకు కారణమయింది. 

also read : వారే వా: ఈ కారు అద్దాలతో తయారైంది.. అంతా కనిపిస్తుంది