గోడకు కన్నం వేసి.. గోల్డ్ షాపులో చోరీ

సుజాతనగర్, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండల కేంద్రంలో గోల్డ్ షాపు గోడకు  కన్నం వేసి  సుమారు  రూ.50 లక్షల విలువ చేసే నగలు ఎత్తుకెళ్లారు.  భవాని  జ్యువెల్లరీ షాపు  గత నెల 31నుంచి మూసి ఉంది.  ఆదివారం షాపు ఓనర్​ షట్టర్ తీసి చూడగా లాకర్లు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు కంప్లైంట్​ చేశాడు.  పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా ఈనెల 1వ తారీఖు అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు షాపు వెనుక నున్న  మరో షాపు నుంచి గోడకు కన్నం వేసి షాపులోకి ప్రవేశించినట్లు ఉంది. గ్యాస్ కట్టర్ల సహాయంతో లాకర్​ ఓపెన్​ చేసి  రూ.50 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు.  క్లూస్ టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు.  చోరీ చేసిన ఇద్దరూ వేరే రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.