బండ్లగూడలో రెచ్చిపోయిన దొంగలు.. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ

బండ్లగూడలో రెచ్చిపోయిన దొంగలు.. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని NFC కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.16 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 25 వేల నగదు దోచుకెళ్లారు. కర్ణాటకలోని ఓ గుడికి దైవదర్శనానికి వెళ్లింది నవీన్ కుటుంబం. 

అయితే రాత్రి ఇంటికి చేరుకున్ననవీన్..డోర్ ద్వంసం చేసి ఉండడం..వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.