బంగారం ధరలు రికార్డు దిశగా పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరలు.. సోమవారం (జనవరి 20, 2025) ఉదయం నాటికి రూ. 81వేల మార్క్ ను దాటేసింది.
గతంలో బంగారం, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉండేవి..అయితే జనవరి నెల ప్రారంభం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాదిలో తులం బంగారం ధర రూ. లక్ష మార్క్ ను టచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గత వారంలో రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5వేలకు పైగా పెరిగింది. ఇ క వెండి ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి.
సోమవారం నమోదు అయిన ధరల ప్రకారం..10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.74వేల340 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.81వేల100 గా ఉంది. ఆదివారం తో పోలిస్తే స్వల్పంగా 10రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా రూ.100లు తగ్గింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,340, 24 క్యారెట్ల ధర రూ.81,100 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,340, 24 క్యారెట్ల ధర రూ.81,100 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.74వేల490, 24 క్యారెట్ల ధర రూ.81వేల250 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.74వేల340, 24 క్యారెట్ల ధర రూ.81వేల100 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.74వేల340, 24 క్యారెట్లు రూ.81వేల100 లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.74వేల340, 24 క్యారెట్ల ధర రూ.81వేల100 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.1,03,900 గా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,400, ముంబైలో రూ.96వేల 400 ఉండగా.. చెన్నైలో రూ.1లక్షా 03వేల900 ..బెంగళూరులో రూ.96వేల 400లుగా నమోదు అయింది.