షూలో గోల్డ్ స్మగ్లింగ్​ ​.. శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో వ్యక్తి అరెస్ట్​

షూలో గోల్డ్ స్మగ్లింగ్​ ​.. శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో వ్యక్తి అరెస్ట్​

విదేశాల్లో చవకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు నానాపాట్లు పడుతున్నారు. అధికారులు కళ్లుగప్పి దుబాయ్​ నుంచి హైదరాబాద్​రే బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ ఫోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దుబాయ్ నుంచి హైదరాబాద్​ కు  విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. EK-528 విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్​ కు  వచ్చిన  ప్రయాణికుడి బూట్లు, వీపుకు తగిలించుకునే లగేజీ  బ్యాగ్​ను  అధికారులు స్కాన్ చేయగా దాదాపు కిలోన్నర బంగారం బయటపడింది.

నిందితుని నుంచి మొత్తం 1390.850 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు DRI అధికారులు తెలిపారు