హైదరాబాద్: నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. అక్బర్ బాగ్ లోని కిశ్వ జ్యూవెలరీలోకి కొంతమంది దుండగులు చోరబడ్డారు. షాప్ యజమానిపై దుండగులు దాడి చేసి నగలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దారవత్.. సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
క్లూస్ టీమ్ కూడా ఘటనాస్థలానికి చేరుకుని.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జ్యూవెలరీ షాప్ నుంచి ఎంత బంగారం నగలను దొంగలించారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.