
మెదక్ టౌన్, వెలుగు: బస్సు కోసం వెయిట్చేస్త న్న మహిళ దగ్గరి నుంచి బంగారం చోరీ చేసిన ఘటన ఆదివారం మెదక్ బస్టాండ్లో లో జరిగింది. బాధితురాలికధనం ప్రకారం.. హవేళీ ఘనపూర్ మండలం కూచన పల్లి గ్రామానికి చెందిన మల్లి కార్జున రాణి ఎల్లారెడ్డి వెళ్లేందుకు మెదక్ ఐస్స్టాండ్లో బస్సు కోసం వేచిచూస్తోంది. కొద్దిసేప టికి బంగారం ఉన్న తన బ్యాగు కనిపించలేదు. వెంటనే చోరీ జరిగిందని గుర్తించి మెదక్ పీఎస్ కు వెళ్లి కంప్లయింట్ చేసింది. ఆ బ్యాగులో 8 తులాల బంగారం ఉన్నట్లు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.