ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ

ఎల్బీనగర్,వెలుగు : ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి బ్యాగులో నుంచి బంగారు నగలను దొంగలు కొట్టేశారు. ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన పద్మలత శుక్రవారం తన అక్కాచెల్లితో కలిసి 28 గ్రాముల బంగారు నగలను రీమోడలింగ్ చేసేందుకు మల్లాపూర్​కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హబ్చిగూడ వరకు ఆటోలో వచ్చి..  అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చారు. బ్యాగులో బంగారం కనిపించకపోవడంతో ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు.