
- రూ.910 పెరిగిన 10 గ్రాముల ధర
న్యూఢిల్లీ: బంగారం ధరలు దేశ రాజధానిలో బుధవారం భారీగా పెరిగి ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. పది గ్రాముల పుత్తడి ధర రూ.910 పెరిగి రూ. 83,750కి చేరుకుందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
ఈ నెల ఒకటిన పది గ్రాముల ధర రూ.79,390గా నమోదయింది. మంగళవారం దీని ధర రూ.82,440 ఉంది. కిలో వెండి ధర రూ.వెయ్యి పెరిగి రూ.93 వేలకు చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ట్రేడ్‌లో ఫిబ్రవరి డెలివరీ ధర రూ.228 పెరిగి రూ.80,517లకు చేరింది. అమెరికా టెక్ స్టాక్స్బాగా నష్టపోతుండటంతో ఇన్వెస్టర్లు బంగారంవైపు మొగ్గుచూపుతున్నారని దేవయా గగ్లానీ అనే ఎనలిస్టు అన్నారు.