![జీడిమెట్ల లోని దుర్గామాత ఆలయంలో బంగారం చోరీ](https://static.v6velugu.com/uploads/2023/11/gold-theft-from-durga-temple-in-jeedimetla_QOShV4PBEq.jpg)
- పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఘటన
జీడిమెట్ల, వెలుగు : దుర్గామాత ఆలయంలో బంగారం చోరీ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. గురువారం తెల్లవారుజామున జీడిమెట్లలోని సరోజిని గార్డెన్ వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలోకి వచ్చిన ఓ దొంగ గుడి తలుపులు పగులగొట్టాడు. అమ్మవారి బంగారు తాళిబొట్టను దొంగిలించాడు. అయితే, చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలయ కమిటీ కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.