మిర్యాలగూడలో ..ఇంటి డోర్లు పగులగొట్టి బంగారం చోరీ

మిర్యాలగూడ, వెలుగు : రెండు పల్సర్ బైకులపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దొంగలు ఓ ఇంటి  డోర్లు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం..  మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ కు చెందిన చిలుకూరి వెంకటేశ్వరరావు కొడుకు అరోగ్యం బాగాలేదు. దీంతో అతని వైద్యం కోసం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా వారం కింద హైదరాబాద్‌‌కు వెళ్లారు.  

బయట గేటుకు తాళం వేసి ఉన్నా డోర్ తెరిచి ఉండడంతో  ఇంటి ఎదురుగా ఉన్న వారు ఆదివారం వెంకటేశ్వర రావుకు చెప్పారు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వచ్చారు.  దొంగలు గడ్డ పారతో  డోర్లను ధ్వంసం చేసి బెడ్ రూమ్‌‌లోని  కప్ బోర్డ్స్, బీరువా పగలగొట్టి 15 తులాల బంగారం

రూ. లక్ష నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై నర్సింహులు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు చెప్పారు.