ఎయిర్ పోర్టులో 840 గ్రాముల గోల్డ్ సీజ్..ఇద్దరు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్​పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్యాసింజర్లు ఆయిల్ టిన్ మూతల మధ్య బంగారాన్ని దాచి తీసుకొచ్చారు. స్కానింగ్​లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 65 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరిపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.