జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం లో  50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే చీఫ్‌‌ సైంటిస్ట్‌‌ డాక్టర్​ ఎన్‌‌. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆర్థిక స్థిరత్వం పొందేందుకు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి కేవీకేలు పనిచేస్తున్నాయన్నారు. రైతులకు, గ్రామీణ యువతకు టెక్నాలజీని అందిస్తూ సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

ఇందుకు దేశవ్యాప్తంగా 731 కేవీకేలు, తెలంగాణలో 16 కేవీకే పనిచేస్తున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ 15 కేవీకేల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈఏడీ డాక్టర్ చేరాలు  మాట్లాడుతూ పరిశోధన సంస్థలు రైతులకు వారధిగా ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులు, కేవికే శాస్తవేత్తలు,  రైతులు పాల్గొన్నారు.