
కంగ్టి,వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో ఓ అరుదైన చేప జాలరి చేతికి చిక్కింది. మండలంలోని తడ్కల్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి తన గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపల కోసం వల వేయగా ఈ చేప అతని వలలో చిక్కింది. చూసేందుకు బంగారు వర్ణంలో మిలమిలా మెరుస్తున్న ఈ చేపను బంగారుతీగ చేపగా ఆ గ్రామస్తులు గుర్తించారు. ఈ చేపను వీక్షించడానికి గ్రామ ప్రజలు ఆసక్తి కనబరిచారు.